జూనియర్ ఎన్టీయార్ గైర్హాజరు.! బాలయ్యే వద్దన్నాడా.?

‘ఎన్టీయార్ కథానాయకుడు’ సినిమా ప్రమోషన్స్ కోసం జూనియర్ ఎన్టీయార్ అవసరమొచ్చింది నందమూరి బాలకృష్ణకి. స్వర్గీయ ఎన్టీయార్ బయోపిక్  అది. ఆ తాత మనవడ్ని పిలుచుకొచ్చారు.

కానీ, స్వర్గీయ ఎన్టీయార్ శతజయంతికి బుడ్డోడిని దూరం పెట్టారు. ఇంతకీ ఎవరు దూరం పెట్టినట్లు.? బాలయ్యే దూరం పెట్టాడన్నది ఇన్‌సైడ్ వినిపిస్తోన్న గాచిప్పు.! జూనియర్ ఎన్టీయార్‌ని బాలయ్య పక్కన పెట్టడం కొత్తేమీ కాదు. ‘పార్టీ తరఫున ప్రచారానికొస్తే..

ప్లస్సవుతుందో.. మైనస్సవుతుందో..’ అని బాలయ్య కొన్నాళ్ళ క్రితం జూనియర్ ఎన్టీయార్ మీద సెటైర్లే వేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ని పిలిచిన బాలయ్య, జూనియర్ ఎన్టీయార్‌ని స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకలకు పిలవకపోవడం క్షమార్హం కాదు.