Ileana: దేవదాసు చిత్రంతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కుర్రాళ్ళ మనసు దోచుకుంది. తర్వాతి చిత్రంతోనే మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించి పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమ విజయంతో అతికొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది.తరువాత వెనుతిరిగి చూసుకోకుండా వరుస సినిమాలు చేస్తూ టాప్ పోసిషన్ ని ఎంజాయ్ చేసింది.తరువాత వచ్చిన ‘మున్నా’ ‘ఆట’ ‘జల్సా’ ‘జులాయి’ వచ్చిన సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి.
జులయ్ సినిమా తరువాత సడన్ గా టాలీవుడ్ ను వదిలేసి బాలీవుడ్ చెక్కిసింది ఇలియానా. కానీ బాలీవుడ్ లో ఆశించిన విజయం దక్కలేదు. అక్కడ నిరాశ నే ఎదురయింది.అంతేకాకుండా ఒక విదేశీయ వ్యక్తి తో ప్రేమ లో కెరీర్ ని నిర్లక్ష్యం చేసింది.కెరీర్ తో పాటు ఫిట్నెస్ ని కోల్పోయి సుసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న సంగతి చెప్పి అందరికి షాక్ న్యూస్ చెప్పింది.
ఆ నిర్ణయానికి కారణం ప్రేమాయణం ఒకటే కాదట,12 ఏళ్ల వయసు నుండే నాకు శరీర సమస్యలు ఉన్నాయి.అందుకే అప్పట్లో సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను.కానీ తర్వాత కొంత కాలం అయ్యాక.. అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా, అవసరమైన వాటిపైనే ఫోకస్ పెట్టాలని తెలుసుకున్నాను అని చెప్పుకొచ్చింది.కానీ కొంతమంది బాడీ షేమింగ్ వల్లే సూసైడ్ అటెంప్ట్ చేసానని రాసేశారు. అది తప్పు. ఆ వార్తలు చదివి నాకు చాలా చిరాకు వచ్చింది.అని ఇలియానా చెప్పింది.ఇలియానా తెలుగులో ఆఖరిగా రవితేజ- శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం పరాజయం చెందడం తో మరొక అవకాశం రాలేదు.