కృతి శెట్టిని వేధించిన యంగ్ హీరో ఎవరు.?

హీరోయిన్ కృతి శెట్టిని ఎవరో వేధించారట. అలాగని ఆమె ఎక్కడో చెప్పిందట.! ఇదీ ఓ గాసిప్. దాన్ని ఖండిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది కూడా.! నిప్పు లేకుండా పొగ రాదు కదా.! వస్తుంది.. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ నిప్పు లేకుండానే పొగ వచ్చేస్తుంటుంది.

అసలే కృతి శెట్టి కెరీర్ ఏమంత గొప్పగా లేదు. ఇంతలోనే ఈ తలనొప్పి ఒకటి.! కృతి శెట్టి తెలుగులో పలువురు యంగ్ హీరోల సరసన నటించింది. ఓ ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చిన హీరో, ఆమెను వేధించడాన్నది తొలుత వెలుగులోకి వచ్చిన గాసిప్.

పైగా, ప్రముఖ నటుడి కుమారుడంటూ ఆ గాసిప్‌లో పేర్కొన్నారు. అంటే, నాగచైతన్య అనుకోవాలా.? కానీ, నాగచైతన్య అలాంటోడు కాదు కదా.! కృతి శెట్టి వివరణ ఇచ్చుకున్నాగానీ, ఆమెని కొందరు టార్గెట్ చేసేస్తున్నారు.

మీడియా ముందుకొచ్చి, ఈ అంశంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలనే యోచనలో వుందట కృతి శెట్టి. లేదంటే, తన కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని ఆమె ఆందోళన చెందుతోందిట.