ఇలియానా.! నీ మొగుడెవరమ్మా.!

బెల్లీ బ్యూటీ ఇలియానా పెళ్లి కాకుండానే తల్లయ్యిందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టులు మీద పోస్టులు పెడుతూ అందరి అటెన్షన్‌ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.

ఇంతకీ ఇలియానాని తల్లిని చేసిన ఆ ప్రముఖ వ్యక్తి ఎవరనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కత్రినా కైఫ్ సోదరుడితో ఇలియానా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తోంది. సో అతనే ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణమా.?

లేదంటే, మాజీ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూనే ఇందుకు కారణమా.? అనే అంశాలపై చర్చ నడుస్తోంది. కాదు, కాదు, వీళ్లెవరూ కాదు.. మరో కొత్ అజ్ఞాత వ్యక్తి ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణం అనే ప్రచారం కూడా జరుగుతోంది.

పెళ్లీ లేదు.. భర్త లేడు.. ఇప్పటికే చాలా మందికి తెలిసిన సరోగసీ పద్దతి అంత కన్నా కాదు, ఇంకేదో టెక్నికల్ పద్ధతిలో ఇలియానా తల్లి కాబోతోందంటూ కొత్త ప్రచారం తెర పైకి వచ్చింది.

ఎవరికి నచ్చింది వాళ్లు మాట్లాడుకోండి.. అంటూ అసలు విషయం రివీల్ చేయకుండా ఇలియానా తన పని తాను చేసుకుంటూ పోతోంది. బేబీ బంప్ ఫోటోలను సైతం పోస్ట్ చేస్తూ నెటిజన్లలో పిచ్చ రేపుతోంది. ఈ సీక్రెట్ ఇలియానా ఎప్పుడూ రివీల్ చేస్తుందో చూడాలి మరి.