కాజల్ పెళ్లి కుదిరిందట. 30 ఏళ్ల వయసు దాటాక ఎట్టకేలకు కాజల్ పెళ్లి పీటలెక్కుతోంది. కాజల్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా? కాజల్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఈయనే… అంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలే వార్తలు. సోషల్ మీడియాలో ఈ గాసిప్పులు గట్రా ఇక చాలు.. అని అనుకున్నారో ఏమో.. కాజలే ఏకంగా తన పెళ్లి మ్యాటర్ ను రివీల్ చేసేసింది.
తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి చెప్పేసింది. అవును… నేను పెళ్లి చేసుకుంటున్నా. ముంబైకి చెందిన బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంటున్నా. అక్టోబర్ 30న ముంబైలో అతికొద్ది మంది సన్నిహితుల మధ్య మా పెళ్లి జరగబోతోంది.. అంటూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది కాజల్.
ఇక.. అంతే నెటిజన్లు ఊరుకుంటారా? ఎవరీ గౌతమ్. ఎక్కడ నుంచి వచ్చాడు. కాజల్ కు ఎలా పరిచయం అయ్యాడు.. అంటూ ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తున్నారు జనాలు.
అయితే.. ఆమె పెళ్లి చేసుకునే గౌతమ్ ఒక బిజినెస్ మెన్. ఆయన వృత్తిలో భాగంగా ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తుంటాడు. అలాగే టెక్ ఎక్స్ పర్ట్ కూడా. ముంబైలో discern living అనే ఓ ఈ కామర్స్ కంపెనీ కూడా ఉంది. దీని ద్వారా తన కస్టమర్లకు ఇంటీరియర్ డిజైన్, హోమ్ డెకరేషన్ లాంటి సర్వీసులను గౌతమ్ అందిస్తుంటాడు. తన ఈ కామర్స్ కంపెనీలో ఇంటీరియర్ డిజైన్ కు సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి.
గౌతమ్ లో మరో కోణం కూడా ఉందండోయ్.. ఆయన మంచి రన్నర్. అప్పుడప్పుడు ముంబై మారథాన్ లలో పాల్గొంటాడు. ఆయన ముంబైలోని కేథడ్రల్ స్కూల్ లో చదివాడు. ఆ తర్వాత యూఎస్ వెళ్లి అక్కడ మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశాడు.
ఇక.. గౌతమ్ కు, కాజల్ కు పరిచయం ఎలా ఏర్పడింది.. అనే డౌట్ కూడా మీకు వచ్చే ఉంటుంది. నిజానికి.. వీళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పటి నుంచి వీళ్ల స్నేహం మాత్రం చెక్కు చెదరలేదట. అయితే.. వీళ్ల స్నేహం కొన్ని రోజుల క్రితమే ప్రేమగా మారిందట. ఆ తర్వాత వివాహ బంధంతో వీళ్లు ఒక్కటవబోతున్నారు. అది అసలు మ్యాటర్.
ఇక.. వీళ్ల పెళ్లి సంగతి తెలిశాక.. వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారాయి. గూగుల్ లో కాజల్, గౌతమ్ పేర్లు నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
One more unseen click of @MsKajalAggarwal & @kitchlug 💕💕 #KajalAggarwal #Kajalism #KajalGautamWeddingOnOct30 pic.twitter.com/7VJFfEKeJM
— Amani Reddy (@amanikajal) October 6, 2020
Be happy forever ❣️
And Haa kaju,plz don't forget us😔
Give some time to us even 🥰
Congratulations @MsKajalAggarwal and @kitchlug 🥰🥳🍾#KajalAggarwal #GauthamKitchlug#KajalGautamWeddingOnOct30 pic.twitter.com/ScBGsyq7KB— Sukanya_kajal_ (@Sukanya_kaj_) October 6, 2020
Congratulations to @MsKajalAggarwal Mam and Gautham Kitchlu in advance for a beautiful venture ahead as a couple from team @wekafawa ❤️
May you guys explore the best in life and live being an epitome of Love together 💞#KajalAggarwal #kajal #kafawa pic.twitter.com/3oY0Zroev9
— KAFAWA (@wekafawa) October 6, 2020