సినీ నటి పూనమ్ కౌర్ మీడియాకెక్కింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్లలో ‘భగత్ సింగ్’ అనే పేరును హీరో కాలికింద పెట్టారనేది ఆమె అసహనం.
భగత్ సింగ్ అంటే అదొక పేరు మాత్రమే. గాంధీ పేరుతో కూడా సినిమాలొచ్చాయ్. సినిమాల్లో విలన్ల పేర్లు ఒక్కోసారి గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు కూడా వుంటాయ్.
అయినా పోస్టర్‌లో హీరో కాలి కింద ఉస్తాద్ అనే పేరుంది. ఆ ఉస్తాద్ కింది చిన్న అక్షరాలతో భగత్ సింగ్ అని పేర్కొన్నారు. ఉన్న పళంగా ఇప్పుడెందుకు పూనమ్ కౌర్ మీడియాకెక్కినట్లు.?
ఓ సినీ ప్రముఖుడు పూనమ్ కౌర్‌తో ఈ వివాదం రాజేయించాడనీ, అతనికి పొలిటికల్ నేపథ్యం కూడా వుందని సినీ వర్గాల్లో ఓ గాసిప్ గుప్పు మంటోంది.
అతని తదుపరి సినిమాలో పూనమ్ కౌర్ నటించబోతోందట. అద్గదీ సంగతి.