మెగా స్పీడ్.! ఆ ఇద్దరిలో ఎవరు ముందు.?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫోకస్ పూర్తిగా ‘భోళా శంకర్’ సినిమా మీదనే పెట్టారు. పనిలో పనిగా తదుపరి సినిమాలపైనా డిస్కషన్స్ షురూ చేశారట చిరంజీవి. రేసులో పూరి జగన్నాథ్, వినాయక్ ముందంజలో వున్నట్లు తెలుస్తోంది.

పూరి జగన్నాథ్‌తో చిరంజీవి చాలాకాలం క్రితమే సినిమా చేయాల్సి వున్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. ఈసారి పక్కా.. అన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. పూరి – కొణిదెల సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశం వుంది.

అయితే, పూరి కంటే ముందు వినాయక్ సినిమాని చిరంజీవి పట్టాలెక్కిస్తారన్నది మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం తాలూకు సారాంశం. రెండూ సైమల్టేనియస్‌గా చేస్తే ఎలా వుంటుంది.? అని కూడా చిరంజీవి సమాలోచనలు చేస్తున్నారట.

అతి త్వరలోనే చిరంజీవి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనీ.. ఇద్దరు దర్శకులూ కథలతో సిద్ధంగా వున్నారనీ, ఇద్దరూ వేగంగా సినిమాల్ని పూర్తి చేయబోతున్నారని సమాచారమ్.