కిచ్చా సుదీప్, మీనాల మధ్య ఉన్న బంధం గురించి ఆసక్తికర విషయాలివే?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది. దశాబ్ద కాలం పాటు నెంబర్ వన్ హీరోయిన్ గా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోయింది. ఇక మొదట 1982లో ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన మీనా ఆ తర్వాత ఎనిమిది ఏళ్లకు రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన నవయుగం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే మీనా తన కూతురు నైనీకాను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈమె సినీ కెరియర్ పరంగా బాగానే ఉన్నప్పటికీ మీనా పెళ్లి ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే కన్నడ హీరో కిచ్చా సుదీప్ ని రహస్యంగా పెళ్లి చేసుకుంది అంటూ జోరుగా వార్తలు వినిపించాయి. మీనా, సుదీప్ ఇద్దరు రెండు సినిమాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. 2003లో విడుదల అయిన స్వాతిముత్తు సినిమాలో నటించగా ఆ తర్వాత 2006లో మై ఆటోగ్రాఫ్ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో మీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అప్పుడే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వీరి పెళ్లి విషయంలో అనేక రకాల వార్తల వినిపించగా ఆ విషయంపై స్పందించిన సుదీప్ మీనా తో తన రహస్య వివాహానికి సంబంధించి వార్తలలో ఎటువంటి నిజం లేదు అని కొట్టిపారేశారు.

మీనా కూడా ఈ వార్తలపై స్పందించింది. మీడియా ఎప్పుడూ నా పెళ్లి విషయంలో అని బాగా అసలు శ్రావణి చూపిస్తూ ఉంటుంది. మీడియా నాకు పెళ్లి చేయడం ఇది మూడోసారి. సుదీప్ కి నాకు పెళ్లి జరిగింది అంటూ వస్తున్న వార్తలు ఎటువంటి నిజం లేదు. మేమిద్దరం మంచి స్నేహితుల మాత్రమే. నేను మీడియా నుంచి నా పెళ్లిని ఎప్పుడు దాచాలనుకోవడం లేదు. అందరికి ఆహ్వానం పంపి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను స్పందించింది మీనా. అయితే ఈ వార్తల వినిపించిన కొద్ది రోజులకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని పెళ్లి చేసుకోగా ఆయన దురదృష్టవశాత్తు ఇటీవలే అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే.