చిరంజీవి రజనీకాంత్ వంటి హీరోలను ఎవరు ఏం పీకలేరు.. ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిన్నటి తరం హీరోలలో ఒకరైనటువంటి గీతాకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ అరడజనుకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సంకీర్తన కోకిల అనే సినిమాలో మినహా మిగిలిన సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదని చెప్పాలి.ఇలా తక్కువ సినిమాలకు దర్శకుడుగా పనిచేసిన గీతాకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే ప్రస్తుతం ఈయన సినిమాలలో నటించకపోయిన సినీ సెలబ్రిటీల గురించి అలాగే ఇండస్ట్రీ గురించి పలు షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతాకృష్ణ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే ఎవరైనా ముందుకు రాగలరని ఈయన పేర్కొన్నారు.టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు అంటూ ఈ సందర్భంగా గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి వాళ్లు ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు.

ఇలా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరోలు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇలాంటి వారిని ఎవరు ఏం పీకలేరు అంటూ గీత కృష్ణ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఇండస్ట్రీలో ఒకహీరో నటించిన సినిమా ఫ్లాప్ అయితే డబ్బు వెనక్కి ఇస్తారు అనడంలో ఏమాత్రం నిజం లేదని ఒకవేళ అలా ఇచ్చిన వాళ్ళు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఇస్తారు అంటూ పలువురు హీరోల గురించి కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.