ఇప్పుడు పవర్ స్టార్ దూకుడికి ఎవరు తట్టుకుంటారో చెప్పండి ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా లాక్ డౌన్ తర్వాత రీసెంట్ గా వకీల్ సాబ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ లాక్ డౌన్ ముందే 80 శాతం టాకీ పార్ట్ కంప్లీటయింది. కాగా మిగిలిన కొన్ని కోర్టు సన్నివేశాలను, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఈ తాజా షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు. మొన్నటి వరకు దీక్షలో ఉన్న పవన్ ఫుల్ గా గడ్డం, జుట్టు పెంచేసి కనిపించారు. కాని వకీల్ సాబ్ సెట్ కి మాత్రం స్టైలిష్ లుక్ తో వచ్చేశారు.

నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్న సీన్స్ ని ప్రస్తుతం షూట్ చేస్తున్నారట. అలాగే పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ కాంబినేషన్ సీన్స్ తో పాటు ఇద్దరి మీద ఒక సాంగ్ ని కూడా త్వరలో షూట్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమా కంప్లీట్ చేసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ని మొదలు పెట్టబోతున్నాడు పవన్ కళ్యాణ్.

ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయిన పవర్ స్టార్ మరో వైపు తన పొలిటికల్ పార్టీ జనసేన పనులు కూడ షూటింగ్ స్పాట్ నుంచే మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు కానిచ్చేస్తున్నారట. తన పార్టీ వ్యక్తులతో కూర్చొని ఆ పనులు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది.

తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణ విద్యార్థి, యువజన విభాగాల కమిటీలను షూటింగ్ లొకేషన్ నుండే నియమించడం జరిగిందని సమాచారం. అందుకు అవసరమైన పేపర్ వర్క్ మొత్తాన్ని లొకేషన్లో ఉండే కంప్లీట్ చేశారట. ఇప్పుడు ఆ ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అటు సినిమాలను, ఇటు రాజకీయాలను బాగానే బ్యాలన్స్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.