Hero Ravi Teja: నా సినిమా ఆపడానికి రవితేజ ఎవరు? రవితేజ నువ్వు 3 లక్షల హీరోవి…. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

Hero Ravi Teja: ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ వచ్చి, ఏవండీ నా దగ్గర ఇంత తక్కువ బడ్జెట్ ఉంది, సినిమా చేసి పెట్టమంటే.. తానెప్పుడూ డోర్స్ తెరచి ఉంచుతానని డైరెక్టర్ సాగర్ అన్నారు. తాను ముఖ్యంగా ఫస్ట్ కోరుకునేది కథ మాత్రమేనని ఆయన తెలిపారు. రామ్, లక్ష్మణ్ తన చేసిన చాలా సినిమాలకు ఫైట్ మాస్టర్‌గా చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే రవితేజ నటించిన అన్వేషణ అనే సినిమాలో ఒక రోజు ఔట్‌డోర్‌లో ఉన్నపుడు గురువు గారు మా కొక సినిమా చేస్తారా అని అడిగినపుడు, రామలక్ష్మణులు హీరోలుగా పెట్టి తాను సినిమా తీయడమేంటీ అనుకొని, సరే చూద్దాం అని తాను చెప్పినట్టు ఆయన అన్నారు. తాను ఈ విషయంపై మళ్లీ మాట్లాడడానికి ఒక తేదీ చెప్పానని, వాళ్లు తూ.చా. తప్పకుండా అదే రోజు తనను కలవడం చూసి, ఇంత సిన్సియర్‌గా ఉంటారా అనిపించిందని ఆయన అన్నారు. అప్పుడు కూడా ఒక 2 నెలలు ఆగి మళ్లీ కలుద్దామని చెప్పానని, ఆయన అన్నారు.

ఇకపోతే రవితేజ గారి కెరీర్ బాగా సాగుతున్న సమయంలో తనకు, ఆయనకు ఓ చిన్న విబేధం వచ్చిందని సాగర్ చెప్పారు. సినిమా రిలీజ్ చేయొద్దని ఆయన అంటే, తాను మాత్రం రిలీజ్ చేయడానికి సిద్ధపడడమే దానికి కారణమని ఆయన అన్నారు. ఈ విషయంలో అసలు రవితేజకు ఏం హక్కుంది అని ఆయన ప్రశ్నించారు. ఆ సినిమాకు అతను 3లక్షల హీరో అన్న సాగర్, ఆ తర్వాత అతని కెరీర్ బాగుండడంతో రేటు పెరిగినా కూడా తాను నష్టపోవాలా అని ఆయన అన్నారు. షూటింగ్ అయిపోయాక టైటిల్ పెట్టడం దగ్గర్నుంచే ఆ క్లాష్ మొదలైందని ఆయన చెప్పారు. కాబట్టి తనకు ఇష్టమైతే ఎంత దూరమైనా వెళతానని, ఇష్టం లేకపోతే మాత్రం అస్సలు పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా MS నారాయణ ఓ సారి చాలా ఎక్కువగా వాగాడని సాగర్ అన్నారు. ప్రొడ్యూసర్ ఏదో పనుండి పదిహేను రోజుల్లో వస్తానని చెప్పాడని, ఆ రోజు నైట్ అతను వెళ్లిపోవాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో MS నారాయణ మందేసి, తింటున్నపుడు టక్కున ఈ లం* కొడుకు ప్రొడ్యూసర్లు ఇలాగే చెప్తారండీ అని అనేసరికి, ఆయన్ని లాగి పెట్టి కొట్టానని ఆయన చెప్పారు. అది జరిగిన నిమిషానికే ఆ ప్రొడ్యూసర్‌కి చెందిన మనిషి వచ్చి డబ్బు ఇచ్చారని, కానీ ఆయన అన్న మాట మాత్రం వెనక్కి తీసుకోలేడు కదా అని ఆయన అన్నారు. ఎవరూ కావాలని చేయరు కానీ, తప్పును చూసి కూడా వదిలెయ్యడం తప్పేనని ఆయన స్పష్టం చేశారు.