బాలయ్య కొడుకు ఏం చేస్తున్నాడబ్బా.!

ఇదిగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడు.. అంటున్నారు. కానీ, ఏడీ.! ఎక్కడా కనిపించడేం. అస్సలు ఆ ఊసే లేదేం. ఆ ఛాయలు కూడా ఎక్కడా కనిపించవేం. నందమూరి వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం విషయంలో వినిపిస్తున్న మాటలివి.

అవును ఎప్పటి ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా. ఆ సినిమా టైమ్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ వుంటుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్లీ చాలా రోజులు కామ్ అప్ అయిపోయింది. ఆ సినిమాతోనూ జరగలేదు. ఆ తర్వాత మరే సినిమాతోనూ జరగలేదు. అసలిప్పటికీ ఇంకా అజా పజా లేదు మోక్షజ్ఞ తెరంగేట్రం విషయంలో.

అసలు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా.? లేదా.? మోక్షజ్ఞకి ఆ ఆలోచనే లేదంటూ మరో వైపు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాలకు నందమూరి ఫ్యాన్స్ చాలా చాలా వర్రీ అవుతున్నారట. నందమూరి వారసుడి తెరంగేట్రం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి, చూసి అలసిపోతున్న ఫీలింగ్ కలుగుతోందట.

ఇంత జరుగుతున్నా.. బాలయ్యకు ఏం పట్టదేం.! ఆయన తన సినిమాల నెంబర్ పెంచుకోవడంపై వున్న దృష్టి, వారసుడి తెరంగేట్రంపైనా కాస్త పెడితే బావుంటుందని ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు.