NTR : ఎన్టీఆర్,కొరటాల ఫిల్మ్ పై సస్పెన్స్ ఎప్పటికి వీడుతుంది..?

NTR : ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు దాదాపు రెండేళ్లు సినిమాలో కనిపించలేదు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం చాలా రోజులు కేటాయించారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. ప్రొమోషన్స్ లో బిజీ గా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారు.

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే కొరటాల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నట్లు అపుడే వార్తలు వినిపించాయి. కానీ సినిమాకు సంబందించిన ఏ విషయం ఎంత వరకు బయటికి రాలేదు. మహా శివరాత్రి సందర్బంగా చిత్ర యూనిట్ ఏమైనా సినిమా గురించి వివరాలు ప్రకటిస్తారనుకుంటే అది జరగలేదు.

నందమూరి అభిమానులను ఊరిస్తున్న ఈ కాంబినేషన్ సినిమా పై అప్ డేట్స్ రాకపోవడం తో నిరాశ పడుతున్నారు. రాజకీయాలకు సంబందించిన సినిమా కావడం ఇందులో ఎన్టీఆర్ స్టూడెంట్ leader గా కనిపించబోతున్నాడనే వివరాలు బయటికి రావడం తో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఈ ఎన్టీఆర్ 30వ సినిమా లో హీరోయిన్ గా ఆలియాభట్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఎన్టీఆర్ ఆలియా కలిసి నటించినా అందులో రామ్ చరణ్ కు హీరోయిన్ గా ఆలియా సీత పాత్రలో కనిపించనుంది. దీంతో ఇపుడు ఎన్టీఆర్ తో ఆలియా జోడి గా నటిస్తుందనే వార్త ఫ్యాన్స్ ను ఖుష్ చేస్తోంది.
కానీ ఎన్టీఆర్ @ 30 సినిమాకు సంబంధించి ఏ విషయం ఇంకా బయటికి రాకపోవడం తో అభిమానులు మాత్రం నిరాశ పడుతున్నారు. కాబట్టి త్వరగా కొరటాల ఈ విషయం పై స్పందించి సినిమా వివరాలు ప్రకటిస్తే ఫ్యాన్స్ కు దిల్ ఖుష్ అవుతుంది మరి.