తన భర్తను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి.. ట్రోల్స్ పై స్పందించిన శ్రియ!

ఇష్టం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకొని అనంతరం వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన మెప్పించారు నటి శ్రీయ. ఈమె ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్ర హీరోలందరి సరసన నటించి ఓవెలుగు వెలిగారు. ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం పలు సినిమాలలో నటించే అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

ఇప్పటికి పలువురు యంగ్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె రష్యాకి చెందిన ఆండ్రీ అనే వ్యక్తిని వివాహం చేసుకుని తన వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈ దంపతులకు రాధా అనే ఒక కుమార్తె కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇలా నిత్యం తన భర్తతో కలిసి పలు హాలిడే వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేయడమే కాకుండా పలు కార్యక్రమాలకు కూడా హాజరవుతూ ఉంటారు.అయితే ఈ దంపతులు బయట ఏ కార్యక్రమానికి హాజరైన కెమెరా ముందుకు రాగానే ఒకరిపై మరొకరు ముద్దుల వర్షం కురిపించుకుంటారు.

ఈ విధంగా కెమెరా ముందు ఒకరికొకరు లిప్ కిస్ పెట్టుకోవడంతో పలుమార్లు ఈ దంపతులు వార్తల్లో నిలవడమే కాకుండా నేటిజెన్ల ట్రోలింగ్ కి గురయ్యారు.ఇకపోతే తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా శ్రీయ తన భర్తకు కెమెరా ముందు పెదవులపై ముద్దు పెట్టడంతో నేటిజన్లు ఈమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలా కెమెరాల ముందు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించినటువంటి ఈమె అది నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం అయినా నా భర్తను నేను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి. ఆయన కూడా దీనిని చాలా సాధారణమైన విషయంగా పరిగణిస్తున్నారు. ఈ మాత్రం దానికి ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కాలేదంటూ ఈ సందర్భంగా తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించి ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చారు.