కేవలం సినిమా పబ్లిసిటీ కోసమేనా.? లేదంటే, సొంత పబ్లిసిటీ కోసం సినిమా చేస్తున్నారా.? సినిమా పబ్లిసిటీ పేరుతో స్టేజ్ మీద ఎంత రొమాన్స్ చేసినా చెల్లిపోతుందని బహుశా నరేష్, పవిత్ర అనుకుంటున్నారేమో.!
‘మళ్ళీ పెళ్ళి’ సినిమా ముసుగులో పవిత్ర, నరేష్ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు.! ఇది సినిమా.. సినిమా కోసం ఏం చేసినా, అది నేరం కాదు ఈ రోజుల్లో. సో, నరేష్.. సినిమాని ఇలా వాడుకుంటున్నాడన్నమాట.
‘మా పెళ్ళి అయిపోయినట్లే.. మానసికంగా ఒక్కటయ్యాం.. సహజీవనంలో వున్నాం.. విడాకులు వస్తే, అధికారికంగా పెళ్ళి చేసుకుంటాం. సహజీవనం నేరం కాదే..’ అంటూ నరేష్ తాజాగా ఓ ప్రశ్నకు బదులిచ్చాడు.
సరిపోయింది సంబరం.! పవిత్ర భర్త, నరేష్ భార్య.. ఇద్దరూ గింజుకోవాల్సిందే. అయినా, లేటు వయసులో ఈ ఘాటు ప్రేమ ఏంటి పవిత్రా నరేషూ.!