Tollywood: టాలీవుడ్ సెలబ్రిటీలకు ఏమైంది… వరుస వివాదాల్లో నిలుస్తున్న స్టార్ సెలబ్రిటీలు?

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రిటీలపై చెడు దృష్టిపడిందని స్పష్టంగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంటున్నారు. గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నాగార్జున కుటుంబం కూడా వివాదాల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం అనంతరం సమంత నాగచైతన్య విడాకుల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున ఈ ఫ్యామిలీ వివాదాలలో నిలిచింది.
ఇలా నాగార్జున కుటుంబానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పూర్తి స్థాయిలో మద్దతు నిలిచారు.

ఇక నిన్నగాక మొన్న మంచు మోహన్ బాబు కుటుంబంలో కూడా పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇవి పూర్తిగా వారి వ్యక్తిగత విషయాలు అయినప్పటికీ ఈ కుటుంబంలో జరిగిన గొడవల గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. మోహన్ బాబు విష్ణు ఒకవైపు మనోజ్ ఒక్కడే ఒక వైపు నిలిచి వీరి మధ్య భారీగా గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఇలా మంచు వివాదం ముగిసింది అనే లోపు అల్లు వివాదం తెరపైకి వచ్చింది.

పుష్ప 2 సినిమా విడుదల సమయంలో తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే అభిమాని చనిపోవడంతో ఆ వివాదం అల్లు అర్జున్ మెడకు చుట్టుకొని ఏకంగా ఆయనని జైలు పాలయ్యేలా చేసింది. పాన్ ఇండియా స్టార్ హీరో నేషనల్ అవార్డు అందుకున్నటువంటి ఒక హీరోని తొక్కిసలాటలో భాగంగా అభిమాని మరణించడంతో అరెస్టు చేయడం పట్ల తనని జైలుకు పంపించడం పట్ల పూర్తిగా వ్యతిరేకత వస్తోంది. ఇలా చిన్నచిన్న విషయాలకే ఈ హీరోలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దిష్టి తగిలిందని అందుకే సెలబ్రిటీలు వరుసగా ఇలా వివాదాలలో చిక్కుకుంటున్నారు అంటూ టాలీవుడ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.