ఎట్టకేలకు తనకు వర్షిణి అంటే ఇష్టమని అందరి ముందు ఒప్పేసుకున్న హైపర్ ఆది?

what is the relationship between hyper aadi and varshini

హైపర్ ఆది, వర్షిణి.. ఈ జంట కూడా సుడిగాలి సుధీర్, రష్మీ జంటలాగే. ఈ జంటకు కూడా ప్రస్తుతం క్రేజ్ ఏర్పడుతోంది. ఈ జంటకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. వీళ్లిద్దరు కలిసి ఢీ షోలో కలిసి పని చేస్తున్నారు. అయితే సుధీర్, రష్మీ అంత బంధం వీళ్ల మధ్య ఉందా? అనే సందేహం మొదట అందరిలోనూ ఉండేది.

what is the relationship between hyper aadi and varshini
what is the relationship between hyper aadi and varshini

అయితే.. తాజాగా ఆ సందేహానికి సమాదానం దొరికేసింది. ఎందుకంటే.. వర్షిణి అంటే తనకు ఇష్టమని హైపర్ ఆది డైరెక్ట్ గా చెప్పేశాడు. అంటే వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో కాదు ప్రేమే అన్నమాట. ఎందుకంటే.. తనకు వర్షిణి అంటే ఇష్టమని హైపర్ ఆది చెప్పినా సరే.. వర్షిణి కూడా ఏమీ అనకుండా.. చిరునవ్వు చిందించింది. అంటే దీని అర్థం అదే కదా మరి.

ఆలీతో సరదాగా.. అనే ప్రోగ్రామ్ లో హైపర్ ఆది, వర్షిణి ఇద్దరూ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆలీ వాళ్లిద్దరినీ సరదాగా ప్రశ్నలు అడుగుతుంటాడు. ఇంతలో పెళ్లి టాపిక్ వస్తుంది. దీంతో పెళ్లెందుకు సార్.. చాలా హ్యాపీగా ఉన్నాను.. అని అంటుంది వర్షిణి. అంటే నీకు ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా? అంటే అవును.. కుదరలేదు అప్పుడు అంటుంది వర్షిణి. వెంటనే హైపర్ ఆది అందుకొని కుదిరేవాళ్లను చూసుకోవాలి అప్పుడు.. అంటూ తనవైపే చూపిస్తుంటాడు ఆది.

అయితే.. వెంటనే ఆలీ.. నీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? వర్షిణి అంటే అని ఆలీ అనేసరికి.. వెంటనే హైపర్ ఆది.. వర్షిణికి ఏంటండి.. చాలా బాగుంటది.. అని అనేసరికి వర్షిణి అయితే ఫ్లాట్ అయిపోయింది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ ప్రోమోను చూసేయండి..

Alitho Saradaga Episode 198 Latest Promo | Hyper Aadi & Varshini on ETV