కమల్ హాసన్ పెట్టిన కండిషన్ ఏంటంటే.. తండ్రిని గురించి షాకింగ్ నిజాలు చెప్పిన శృతిహాసన్!

లోకనాయకుడు కమలహాసన్ కుమార్తెగా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న నటి శృతిహాసన్. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తన ప్రొఫెషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది. తన తల్లిదండ్రులు విడిపోవడం తనకి బాధాకరమే అయినప్పటికీ అప్పటినుంచే తను స్వతంత్రంగా బతకడం నేర్చుకున్నానని, ఆర్థిక విషయాలపై అవగాహన పెరిగిందని చెప్పింది. తెలియకుండా తాను దొంగ చాటుగా గుడికి వెళ్లే వెళ్లేదానని చెప్పింది.

అందుకు కారణం కూడా చెప్పింది శృతిహాసన్. తన తల్లి ఆధ్యాత్మికత ఎక్కువ అయితే కమల్ హాసన్ నాస్తికుడు అందుకే ఇంట్లో ఎవరు గుడికి వెళ్ళటానికి వీల్లేకుండా పోయేది. అయితే తన తాత గారితో గుడికి వెళ్ళిన విషయాన్ని శృతిహాసన్ గుర్తు చేసుకున్నారు. తాతగారు తనని గుడికి తీసుకు వెళ్లినప్పటికీ తన కొడుకు కమలహాసన్ కి చెప్పొద్దని చెప్పేవారట, ఎందుకంటే కమలహాసన్ నాస్తికుడు కాబట్టి ఇంట్లో గుడికి ఎవరూ వెళ్ళకూడదని షరతు పెట్టేవారట. అయితే కొన్ని రోజుల తర్వాత తనకి కూడా దేవుడిపై భక్తి ఏర్పడిందని అందుకే దొంగ చాటుగా గుడికి వెళ్ళేదాన్నని చెప్పింది శృతి.

కానీ చాలా కాలం వరకు నాన్నకు తెలియదని చెప్పుకొచ్చింది. మా కాలనీలో నేను సైకిల్ తొక్కే ఒక లేన్ ఉండేది ప్రధాన ద్వారం దగ్గర రైడ్ చేయవద్దని నాపై కండిషన్ కొన్ని కారణాలవల్ల ప్రతిరోజు ఉదయం నేను చర్చి గంటలను ఒకే సమయంలో వినేదాన్ని దేనిని ముందుగా చేరుకోవాలో ఆలోచిస్తాను. గుడి మా ఇంటికి చాలా దూరంలో ఉంది కాబట్టి వారిని ఒకసారి చర్చికి వెళ్లే దానిని. ఐదు ఆరు నెలలైనా ఇంట్లో ఎవరికీ తెలియదు, సహజంగానే ఏదైనా చేయవద్దు అని చెప్తే పిల్లలు అదే చేస్తారు కదా అంటూ నవ్వేసింది శృతి.

తనకి దేవుడి మీద ఉన్న నమ్మకమే తనని ఈ స్థాయిలో ఉంచిందని ఇంత ధైర్యంగా ఉండటానికి కారణం దైవభక్తి అని చెప్పుకొచ్చింది ఈ స్టార్ కిడ్ కిడ్. ఒకప్పుడు ఈ నటి డిప్రెషన్ కి లోనే మధ్యానికి కూడా బానిసై పూర్తిగా ఆరోగ్యం పాడు చేసుకుంది. అయితే దానికి కారణం చాలా మందికి తెలియదు. దాని గురించి కూడా మాట్లాడుతూ నేను డిప్రెషన్ లోకి వెళ్లడానికి కారణం అమ్మానాన్నల విడాకులే అని చెప్పింది శృతిహాసన్.