ఆదిపురుష్.. ఆ పరిస్థితి ఎలా ఉందంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రం మొదటి రోజే ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక రెండో రోజు శనివారం కూడా వంద కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడం విశేషం. ఆదివారం కూడా వంద కోట్లకి పైనే ఆదిపురుష్ కలెక్షన్స్ ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఆదిపురుష్ చిత్రానికి అద్భుతమైన ఆదరణ వస్తోంది. ఓ వైపు సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ కొంతమంది పనికట్టుకొని ప్రచారం చేస్తోన్న సాధారణ ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి స్పందన వస్తూ ఉండటం విశేషం. త్రీడీలో ఆదిపురుష్ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీకెండ్ పూర్తయిన తర్వాత అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతూ ఉండటం విశేషం.

హైదరబాద్ లో నెక్సస్ మాల్ లో సోమవం సినిమా చూడటం కోసం ఏకంగా 80 శాతం అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అలాగే ప్రసాద్ మల్టీప్లెక్స్ లో 21 షోలకి 75 శాతం ఆక్యుపెన్సీతో బుకింగ్స్ జరగడం విశేషం. దీనిని బట్టి ఈ సినిమా వీకెండ్ పూర్తయితే ఆదరణ తగ్గుతుందనే అంచనాలు తలక్రిందులు అయ్యాయని చెప్పొచ్చు. విస్తృతంగా నెగిటివ్ ప్రచారం చేస్తోన్న కూడా దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ కి అందరూ కనెక్ట్ అవుతున్నారు.

అలాగే సినిమా ఆరంభంలోనే రామాయణం ఆధునీకరణ అని చెప్పడం కూడా ఆదిపురుష్ కి ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. అందుకే మెజారిటీ ఆడియన్స్ రామాయణం కథని చూస్తున్న ఫీలింగ్ లో కథని ప్రెజెంట్ చేసిన విధానాన్ని మాత్రమే చూస్తున్నారు. 18 ఖండాల రామాయణం మూడు గంటల సినిమాగా చూపించడం చాలా గొప్ప విషయం అని అంటున్నారు. ఎప్పుడో పూర్వకాలంలో చూసినట్లు ఇప్పటికి రామాయణం అలాగే చూడాలని రూల్ ఏమీ లేదని కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా విజువల్ ఎఫెక్ట్ తో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మౌత్ టాక్ కారణంగా సోమవారం నుంచి పాజిటివ్ బజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి లాంగ్ రన్ లో సినిమా కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయానదానిని బట్టి సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది.