టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మంచి గుర్తింపు పొందారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన వారిలో కోటా శ్రీనివాసరావు కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ కొన్ని వందల సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. కొన్ని సినిమాలలో విలన్ గా నటించి మెప్పించిన కోట శ్రీనివాసరావు మరికొన్ని సినిమాలలో కమెడియన్ గా నటించి ప్రేక్షకులను నవ్వించాడు. ఇలా పాత్రతో సంబంధం లేకుండా ఏ పాత్రలోనైనా ఎనమైపోయి నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
చిన్నప్పటినుండి నాటకాల మీద ఉన్న వ్యామోహం వల్ల బ్యాంకులో ఉద్యోగం వదిలేసి సినిమా రంగంలో అడుగుపెట్టి ఒక గొప్ప స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం వయసు మీద పడటం వల్ల నటించే శక్తి లేక సినిమాలకు దూరమయ్యాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోటా శ్రీనివాసరావు గారు తన వ్యక్తిగత జీవితం గురించి సినిమాల గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత అధికంగా బాగా నిలదొక్కుకున్నానని వెల్లడించాడు. సావిత్రి, సౌందర్య లాంటి ఎందరో నటీమణులు తమ నటనతో మెప్పించినప్పటికీ ఆర్థికంగా చితికిపోవడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించాడు.
ప్రస్తుతం ఆర్థికంగా సమాజంలో కొన్ని కోట్ల మంది కంటే తాను మంచి పొజీషన్ లో ఉన్నానని, అయితే ఎన్ని కోట్ల ఆస్తి ఉంటే మాత్రం దానిని అనుభవించటానికి కొడుకు లేడు కదా అని చనిపోయిన కొడుకుని తలచుకొని కన్నీరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి తమ పిల్లల కోసం పోగు చేస్తారు. అలా పిల్లల అవసరాలు తీర్చడమే కాకుండా భవిష్యత్తులో కూడా వారికి ఆసరాగా ఉండాలని రాత్రి పగలు కష్టపడి ఆస్తులు కూడపెట్టి వారి పిల్లలకు ఇస్తారు. కానీ నా కొడుకు పోయాక ఎన్ని కోట్ల ఆస్తులు ఉంటే ఏం లాభం అంటూ కొడుకు గురించి తలుచుకొని బాధ పడ్డారు.