ప్రభాస్ కు తల్లిగా నటించడం ఏంటి.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇలా ఈ సినిమా తరువాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయ్యారు.ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన రమ్యకృష్ణకు కూడా ఎంతో మంచి క్రేజ్ దక్కింది.

బాహుబలి సినిమాలో ప్రభాస్ తల్లిగా శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించారు. అయితే రాజమౌళి శివగామి పాత్రలో నటించడం కోసం ఎంతోమంది హీరోయిన్లను సంప్రదించారు. ఈ క్రమంలోనే శివగామి పాత్రలో ప్రభాస్ తల్లిగా నటించడం కోసం మంచు లక్ష్మికి కూడా ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై మంచు లక్ష్మి స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించే అవకాశం వచ్చింది అనే విషయంపై స్పందిస్తూ తాను ప్రభాస్ కి తల్లిగా నటించడం ఏంటి అంటూ సమాధానం చెప్పారు.

ఈ సినిమాలో నటించకపోవడం నాకు చాలా గర్వంగా ఉందని ఈమె తెలిపారు.ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది కావచ్చు అయితే మన ఇండియాలో ఒకసారి ఏ పాత్రలో నటించామంటే అదే పాత్రకు స్థిరపడిపోతాము అందుకే తాను ఈ సినిమాలో నటించడానికి ఇష్టపడలేదని ఈ సందర్భంగా మంచు లక్ష్మి వెల్లడించారు. అయితే ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని, ఆ పాత్రకు తాను మాత్రం సెట్ అవ్వననీ ఈ సందర్భంగా మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.