ప్రబాస్‌కి ఏమైంది.? ఎందుకీ రూమర్.!

‘బాహుబలి’ సినిమాతో యూనివర్సల్ స్టాయి హీరో అయిపోయాడు ప్రబాస్. దాంతో, ఆయన చేసే సినిమాల స్కేల్ కూడా పూర్తిగా మారిపోయింది. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే వస్తున్నాయ్ ప్రబాస్ నుంచి. అయితే, ఈ మధ్య ప్రబాస్ ఆరోగ్యంపై కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయ్.

నడవడానికి ప్రబాస్ చాలా కష్టపడుతున్నాడనీ, భరించలేని కాలి నొప్పితో బాధపడుతున్నాడనీ నిలబడడానికి కూడా కష్టపడుతున్నాడనీ అంటున్నారు.

‘సాహో’ టైమ్‌లో కాలికి దెబ్బ తగిలింది ప్రబాస్‌కి. ఆ కాలి గాయం కారణంగానే సినిమా షూటింగ్ కొన్నాళ్లు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఆ నొప్పితోనే ఎలాగో సినిమా పూర్తి చేసేశాడు.. ‘రాధేశ్యామ్’ టైమ్‌లో ఆ కాలికి సర్జరీ జరిగింది.

అయినా కానీ సెట్ కాలేదట. ఇప్పుడు అది బాగా ఇబ్బంది పెట్టేస్తోందని అంటున్నారు. ఆ కాలి గాయం కారణంగానే ప్రబాస్ నిలబడ్డానికి కూడా కష్టపడుతున్నాడనీ తెలుస్తోంది. నిజంగానే ప్రబాస్‌ని కాలి గాయం అంతగా బాధిస్తోందా.? లేదంటే, ఇదంతా జస్ట్ రూమర్సేనా.? తెలియాల్సి వుంది.

ప్రస్తుతం ప్రబాస్ చేతిలో ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘స్పిరిట్’ తదితర బోలెడన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయ్.