ప్రభాస్ కు ఏమైంది.. షూటింగ్ కు సడన్ బ్రేక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకి రెండేళ్ళ పాటు కాల్ షీట్స్ ఇస్తున్నాడు. సాహో, రాదేశ్యామ్ సినిమాల తర్వాత ఆదిపురుష్ మూవీ కంప్లీట్ చేశాడు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ మూవీ షూటింగ్ తాజాగా విశాఖపట్నంలో స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఇదిలా ఉంటే మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ప్రభాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

రాజా డీలాక్స్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ని ఈ నెలలో మళ్ళీ మారుతి ప్లాన్ చేసుకున్నారు. అనుకున్న ప్రకారం కాల్ షీట్స్ ని ప్రభాస్ ఫిబ్రవరి ఇచ్చారు. అయుతే ఊహించని విధంగా ప్రభాస్ జ్వరంతో బాధపడుతూ ఉండటంతో ఈ నెలలో జరగాల్సిన మారుతి సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉండకపోవచ్చనే మాట వినిపిస్తుంది.

జ్వరం కారణంగా ప్రస్తుతం ప్రభాస్ రెస్ట్ తీసుకుంటున్నాడు అని తెలుస్తుంది. మెడికేర్ లో ఉన్నారని టాక్. చిన్న జ్వరమే అయిన గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తూ ఉండటంతో పని ఒత్తిడి కారణంగా కాస్తా వీక్ గా ఉన్నారనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఆరోగ్యం దృష్ట్యా కాస్తా విశ్రాంతి తీసుకుంటున్నాడు అని తెలుస్తుంది. అయితే పరిస్థితి బట్టి ఆయన షెడ్యూల్ లో పాల్గొనేది లేనిది డిసైడ్ అవుతుందని తెలుస్తుంది.

ఇక ప్రభాస్ సలార్, మారుతి సినిమాలతో పాటు ప్రాజెక్ట్ కె షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశాడు. ఇక సలార్ మూవీ షూటింగ్ ముగింపు దశకి వచ్చిందని తెలుస్తుంది. దాని తరాత మారుతి సినిమా షెడ్యూల్ ని పూర్తి చేసి పూర్తిగా ప్రాజెక్ట్ కె కోసం ప్రభాస్ దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఇక నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ రాక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.