ఎన్టీఆర్ కారణంగా జాతీయ అవార్డును కోల్పోయిన నాగార్జున…?

ప్రస్తుతం పాన్ ఇండియా హవా కొనసాగడంతో సౌత్ ఇండస్ట్రీలో తెరకేక్కిన సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతూ ఎంతో మంచి క్రేజీ సంపాదించుకున్నాయి. ఈ విధంగా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై సౌత్ సినిమాల హవా కొనసాగుతోంది. కానీ 90 లలో తెలుగు సినిమాలంటే బాలీవుడ్ హీరోలకు చులకన భావం ఉండేది.అయితే అంతకుముందు ఎన్టీఆర్ ఏఎన్నార్ నటించే సమయంలో తెలుగు సినిమాలకు మంచి గుర్తింపు ఉండేది వీరు నటించిన సినిమాలను హిందీలో కూడా డబ్ చేసి విడుదల చేసుకునేవారు.

ఇక చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా తక్కువగా వచ్చేవి. ఇక తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ కొనసాగిన సమయంలో తెలుగు సినిమాలకు ఇలాంటి అవార్డులు కనుమరుగైపోయాయి. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంకుషణ పాలనపై వ్యతిరేకంగా పోరాడుతూ విజయం సాధించింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీ ఈ అవార్డుల విషయంలో పూర్తిగా అన్యాయం చేసింది.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావటం వల్ల ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారన్న ఉద్దేశంతో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ అవార్డు రాకుండా అడ్డుకుంది. గీత కృష్ణ దర్శకత్వంలో నాగార్జున రమ్యకృష్ణ జంటగా నటించిన చిత్రం సంకీర్తన. ఈ సినిమాకు గాను ఉత్తమ జాతీయ నటుడిగా నాగార్జునకు జాతీయ అవార్డు రావాల్సి ఉండగా ఈ విషయంపై పెద్ద ఎత్తున రాజకీయాలు జరిగి ఈ అవార్డు రాకుండా అడ్డుకున్నారు. ఇలా నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును కోల్పోవాల్సి వచ్చింది.