దివంగత హీరో నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. నందమూరి కుటుంబం నుండి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కూడా బాలకృష్ణ మాత్రం తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఎన్నో ఏళ్లుగా సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అంతేకాకుండా ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ అనే రియాలిటీ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు. ఇలా నిత్యం షూటింగ్ లతో బిజీగా ఉండే బాలకృష్ణ మరొకవైపు ఆంధ్రప్రదేశ్ హిందూపురం ఎమ్మెల్యేగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ఇలా ఒక వైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలలో అంటూ బాలకృష్ణ బాగా ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన తండ్రి వారసత్వంగా కూడా కొన్ని వందల కోట్ల విలువ చేసే ఆస్తులు బాలకృష్ణకు సంక్రమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కొక్క సినిమాకి రూ. 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. అంతేకాకుండా ఆహా లో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో లో హోస్ట్ గా వ్యవహరించినందుకు ఒక్కో ఎపిసోడ్ కి దాదాపు రూ.10 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమాలు, రియాల్టీ షోల ద్వారా బాగా సంపాదిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలయ్య ఆస్తుల వివరాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. హైదరాబాదులో బాలయ్య కి రూ.30 కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లా తో పాటు కోటి రూపాయలకు పైగా విలువచేసే కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బాలకృష్ణ దగ్గర 60 తులాల బంగారం.. 5 కేజీల వెండి ఉండగా.. ఆయన భార్య వద్ద నాలుగు కేజీల బంగారం.. 300 క్యారెట్ల వజ్రాలు.. 31 కేజీల వెండి ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే షేర్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య బాబు దగ్గర సుమారుగా రూ. 400 కోట్ల విలువ చేసే ఆస్తితో పాటు తన తండ్రీ వారసత్వంగా ఇచ్చిన ఆస్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.