BalaKrishna: భగవత్ సందేశాన్ని చక్కగా చూపించాము…. బాలయ్య కామెంట్స్ వైరల్!

BalaKrishna: బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, అందాల భామ ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన చిత్రం అఖండ. కాగా ప్రముఖ హీరోలు జగపతిబాబు, శ్రీకాంత్‌తో పాటు నటి పూర్ణ కీలక పాత్రలో నటించి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాక్సాఫీస్‌ వద్ద కోట్లలో వసూలు రాబట్టిన ఈ సినిమా పలువురి విమర్శకుల చేత సైతం ప్రశంసలు అందుకుంది. థియేటర్లకు ఓ రకంగా ప్రాణం పోసి, కథ బాగుంటే సినీ ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని మరోసారి రుజువైంది.

ఇప్పటికే ఎన్నో రికార్డులను, రివార్డులను అందుకున్న అఖండ సినిమా తాజాగా 100 రోజులను పూర్తి చేసుకుని మరో ఘనత సాధిచింది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కొన్నేళ్లుగా తెలుగులో శతదినోత్సవాలే కరువయ్యాయని, అలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ‘అఖండ’ సినిమా ఘన విజయం సాధించడం నిజంగా తెలుగు సినిమాకు ఓ దిక్సూచిలా మారిందని ఆయన అన్నారు. అంతే కాకుండా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతే కాకుండా ‘అఖండ’ సినిమాకు అఖండమైన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ బాలయ్య తన అభిప్రాయాన్ని తెలియజేసారు. ఈ సినిమాలో మన హైందవ సంస్కృతిని, తెలుగు సంప్రాదాయాలను అద్భుతంగా చూపించిన బోయపాటిని ఆయన కొనియాడారు. అంతేకాదు ప్రకృతి, మహిళలు, పసిపిల్లలకు అన్యాయం జరిగినపుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడన్న ఆ భగవత్ సందేశాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించమని ఆయన గొప్పగా చెప్పుకున్నారు. ఇలాంటి అద్భుతమైన సందేశం ఉన్న చిత్రాన్ని అందించే అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని బాలయ్య చెప్పారు. అంతే కాకుండా ‘అఖండ’ మూవీ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు హీరో నందమూరి బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీనును ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.