Maa Association: ప్రస్తుతం తాను మంచు విష్ణు ఫ్యానెల్‌లో ఉన్నానని నటుడు పసునూరి శ్రీనివాసులు అన్నారు. అందరూ అనుకుంటున్నట్టు మా’ ఆఫీస్‌లో స్టాఫ్‌ని తాము మార్చలేదని, వాళ్లే వెళ్లిపోయారని ఆయన చెప్పారు. దానికి కారణాలు చాలా ఉండొచ్చని, లేదంటే ఎవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ వల్లనైనా వెళ్లిపోయారేమోనని ఆయన అన్నారు. కానీ దాని వెనకాల మాత్రం ఏదో బలమైన కారణమే ఉండొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏం జరిగిందో తెలియదు గానీ, ఏదో మాత్రం జరిగిందని ఆయన చెప్పారు. వాళ్ళు చేసిన తప్పులు కూడా తర్వాత తెలిసిందని, కానీ వాటిని కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్ ద్వారానో వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయారని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే ఇప్పటికే మంచు విష్ణు గారు మా అసోసియేషన్‌కు బిల్డింగ్ కట్టిస్తామని చెప్పిన విషయం తెలిసిందేనని, దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని శ్రీనివాసులు అన్నారు. ఇప్పటివరకు కొన్ని సైట్‌లు చూశామని ఆయన చెప్పారు. కానీ దాని గురించి తాను ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని ఆయన తెలిపారు. అవన్నీ రెగ్యులర్‌గా రొటీన్‌గా జరిగేవేనని ఆయన అన్నారు. మానిఫెస్టోలో తమ ప్రెసిడెంట్ గారు చెప్పినవన్నీ చేస్తారని శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు.
ఎప్పుడూ లేనిది ఈ సారి మా ఎలక్షన్లు ఇంత సంచలనంగా మారడం వల్ల కొందరి మాటలు ఆలోచించేటట్టు చేశాయని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో ఏం చేయలేరు అన్నావారు కూడా ఉన్నాయని, కొందరు మాత్రమే చేయగలరన్న మాటల వల్ల కొందరు హర్ట్ అయ్యారని ఆయన తెలిపారు. అందుకే ఎలక్షన్లు జరగాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.