టాలీవుడ్ లో “వాల్తేరు వీరయ్య” విధ్వంసం.!

ఈ ఏడాదికి టాలీవుడ్ లో ఇప్పటివరకు ఓ భారీ మెగా బ్లాక్ బస్టర్ హిట్ ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా డెఫినెట్ గా మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజ రవితేజాలు నటించిన సినిమా “వాల్తేరు వీరయ్య” మాత్రం ఉందని చెప్పాలి. దీనిని దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించగా సంక్రాంతి బరిలో గట్టి పోటీ నడుమనే ఈ సినిమా రిలీజ్ కి వచ్చింది.

కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనూహ్యంగా అదిరే లెవెల్లో అయితే ఈ సినిమా వసూళ్లు అందుకొని మెగాస్టార్ కెరీర్ లో మరో సెన్సేషనల్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీలో రారాజు ఎప్పటికీ మెగాస్టార్ అనే మాటకి సార్థకం చేసింది. కాగా ఈ భారీ సినిమా హిట్ టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో అనేది మొన్న మెగాస్టార్ చెప్పినట్టుగా వెళ్లేలా ఉంది.

ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ గ్రాసింగ్ హిట్స్ లో టాప్ 6 కి చేరినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ని క్రాస్ చేసి అల వైకుంఠపురములో వెనుక ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో బాహుబలి చిత్రాలు ఆర్ ఆర్ ఆర్ ల దగ్గరకి వెళ్లే ఛాన్స్ ఈ సినిమాకి లేకపోలేదు అని చెప్పాలి.

అయితే ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో మంచి రన్ ని కొనసాగిస్తున్నట్టుగా ట్రేడ్ ఇప్పుడుకీ చెప్తుంది. దీనితో వాల్తేరు వీరయ్య విధ్వంసం మాత్రం అదిరే లెవెల్లో కొనసాగుతుంది. కాగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహించారు.