ఆ రోజు కోసం ఎదురుచూస్తున్న.. ప్రేమతో ఎన్టీఆర్ కి స్వాగతం పలికిన టాలీవుడ్ కింగ్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన తన తదుపరిచిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఒక హీరో మరొక హీరో మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధంతోనే ఒకరి సినిమాకి మరొకరు ఎంతో మద్దతు తెలుపుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తెలుగులో బ్రహ్మాస్త్రం పేరిట రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

ఈ సందర్భంగా నాగార్జున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో సెప్టెంబర్ రెండవ తేదీ సాయంత్రం 6 గంటలకు పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ క్రమంలోనే నాగర్జున సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… సెప్టెంబర్ రెండవ తేదీ నిన్ను కలవాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ ఎన్టీఆర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇలా ప్రేమగా ఎన్టీఆర్ కి ఆహ్వానం పలుకుతూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.