Vijay Devarakonda : సుక్కు సినిమా లెక్క ఏంటో…రౌడీ బాయ్ వచ్చే ఏడాది కన్నా చేస్తాడా…?

Vijay Devarakonda : మన అర్జున్ రెడ్డికి మీడియా అంటే అస్సలు పడదు. అతని గురించి గాసిప్ రాసినా, న్యూ ఫిల్మ్ అప్ డేట్ అడిగిన కస్సుమని లేస్తాడు విజయ్. ఇక ప్రస్తుతం పూరీతో సెటిల్ అయ్యాడు మన గీత గోవిందుడు. లైగర్ అంటున్నాడు. అయ్యాక జనగణమన అంటున్నాడు. పూరీ కూడా తన శైలికి విరుద్ధంగా ఎక్కువ రోజులు సినిమా తీస్తున్నాడు. ఈ లెక్కన వచ్చే ఏడాది వరకు విజయ్ పూరీ చేతిలోనే ఇక అపుడే కమిట్ అయినా శివ నిర్వాణ సినిమా ఎపుడు ఇక లెక్కల మాస్టారు సుక్కు సినిమా ఎపుడు.

విజయ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఆ మధ్య ప్రకటన వచ్చింది. ఫాల్కన్‌ క్రియేషన్స్‌ పతాకంపై కేదార్‌ సెలగమ్‌శెట్టి నిర్మిస్తారని అప్పుడు చెప్పారు. ఈ ప్రకటన వచ్చి చాలా రోజులు అయిపోయింది . అప్పటి నుండి సినిమా ఎప్పుడు అంటే,ఇదిగో ఇప్పుడు, అప్పుడు అని వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ఇంకా ఈ సినిమా మీద స్పష్టత రావడం లేదు. ఇప్పుడు మరోసారి సినిమా మీద అనుమానాలు మొదలయ్యాయి.

విజయ్ పూరీ సినిమాతో బిజీ అయిపోయాడు. లైగర్ ఈ ఏడాది వస్తే నెక్స్ట్ ఇయర్ జనగణమన వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక పూరీ సినిమాల తర్వాత శివ నిర్వాణ సినిమా ఉంటుందని సమాచారం ఇక అదెప్పుడు పూర్తవ్వాలి సుక్కు విజయ్ సినిమా ఎపుడు మొదలవ్వాలి.అయితే ఇక్కడో ఇంకో మెలిక ఉంది . మొన్నీ మధ్య ‘పుష్ప’ విడుదలయినపుడు విజయ్‌ పుష్ప టీమ్‌ మొత్తానికి శుభాకాంక్షలు చెప్పాడు. పనిలో పనిగా తన సినిమా ఉందని, అదిరిపోతుందని కూడా ఆ ట్వీట్‌లో యాడ్‌ చేసేశాడు. అదేనండీ ‘2023లో ర్యాంపేజ్‌ ’ అంటూ రాసుకొచ్చాడు. ఆ లెక్కన అయితే వచ్చే ఏడాది సుకుమార్‌ సినిమా ఉండాలి? మరి ఉందొ లేదో వాళ్లిద్దరిలో ఒకరు తేల్చాలి.