నా వల్లే అఖిల్ సినిమా ఫ్లాప్ అయింది.. వివి వినాయక్ షాకింగ్ కామెంట్స్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల జాబితాలో దర్శకుడు వివి వినాయక్ ఒకరు. ఆది సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన వినాయక్ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించి అందరిని సందడి చేశారు.ఇకపోతే ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారి వారసులను వినాయక్ ఇండస్ట్రీకి లాంచ్ చేశారు. హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారిలో అక్కినేని హీరో అఖిల్ ఒకరు. అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో తెరకేక్కిన అఖిల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాను కనీసం అక్కినేని అభిమానులు కూడా ఆస్వాదించలేకపోయారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ అఖిల్ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అఖిల్ సినిమా గురించి వినాయక్ మాట్లాడుతూ అఖిల్ సినిమా ఇలాంటి ఫలితాన్ని ఎదుర్కోవడానికి తానే కారణమని ఒప్పుకున్నారు.

సాధారణంగా స్టార్ హీరో వారసులైన కొత్త హీరోలైన వారిని ఇండస్ట్రీకి లాంచ్ చేసేటప్పుడు ఇలాంటి యాక్షన్ చిత్రంతో కాకుండా… లవ్ స్టోరీతో వారిని ఇండస్ట్రీకి లాంచ్ చేయాలని తెలుసుకున్నాను అంటూ వినాయక్ తెలిపారు. అయితే స్టార్ హీరో వారసుడనే ఉద్దేశంతో కథ ఇలా ఉండాలి అలా ఉండాలి అని భావించకూడదని కంటెంట్ మాత్రమే ప్రధానమని ఈ సందర్భంగా అఖిల్ సినిమా ఫ్లాప్ కావడం వెనుక తానే కారణమని వినాయ క్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.