ఎన్టీఆర్ నన్ను వదిలించుకోవాలని ..వివి వినాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆది, ఠాగూర్ చెన్నకేశవరెడ్డి, అదుర్స్, సాంబ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి ఆది, సాంబ, అదుర్స్ వంటి 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన వివి వినాయక్ ఇటీవల అతని గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఎంతోమంది హీరోలు దర్శకులు గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారుతున్నారు. ఇటీవల వివి వినాయక్ మాట్లాడుతు ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు గారి శిష్యులకి, సాగర్ గారి శిష్యులకి మధ్య వివక్ష చూపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రాఘవేంద్రరావు గారి శిష్యులు అని చెప్తే పెద్ద స్టార్ హీరో అయినా కూడా వెంటనే కథ వింటాడు. కానీ సాగర్ గారి శిష్యులు అంటేనే వారి కథ వినటానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. ఇండస్ట్రీలో ఇలా వివక్ష చూపిస్తున్నారు అంటూ వివి వినాయక్ వెల్లడించాడు. వాస్తవానికి ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో నేను కూడా కథ చెప్పడానికి వెళ్తే ఎన్టీఆర్ నన్ను ఎలా వదిలించుకోవాలా అని చూశాడు అంటూ ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కథ చెబితే ఏదో విని పంపించేద్దాం అన్నట్టుగా మొదట నేను చెప్పిన లవ్ స్టోరీ విని ఎన్టీఆర్ అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని లవ్ స్టోరీ చేయద్దు అని చెప్పటంతో ఆ విషయం నాకు చెప్పలేక ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడు అంటూ చెప్పుకొచ్చాడు.

వివి వినాయక్ చెప్పిన లవ్ స్టోరీ జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించటంతో వినాయక్ కొంత నిరాశ చెందాడు. తర్వాత బాబు మరొక స్టోరీ చెప్తాను అది నచ్చకపోతే డైరెక్ట్ గా చెప్పేయండి అని వినాయక్ అన్నాడట. రెండురోజుల్లో ఆది సినిమా స్టోరీ రాసుకొని వెళ్లి ఎన్టీఆర్ కి చెబితే కథ నచ్చి వెంటనే మన సినిమా చేద్దామని చెప్పాడు. వివి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆది సినిమా అతి తక్కువ వయసులోనే ఎన్టీఆర్ ని స్టార్ హీరోగా చేసింది.