విశ్వక్‌సేన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య.!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో కలిసి నటించేందుకు నందమూరి నట సింహం బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనీ తెలుస్తోంది. ఇటీవల విశ్వక్‌సేన్‌ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకి బాలయ్య బాగా సపోర్ట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే తనను బాలయ్యకి అభిమానిగా అభివర్ణించుకున్నాడు విశ్వక్ సేన్. బాలయ్య ఒప్పుకుంటే, ఆయనను డైరెక్ట్ చేయడానికి రెడీగా వున్నానని చెప్పాడు. అయితే, డైరెక్షన్ కాదు కానీ, విశ్వక్ సేన్ నటిస్తున్న ఓ సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఓ ఇంపార్టెంట్ రోల్‌లో బాలయ్య కనిపించబోతున్నాడట. ఓ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడనీ సమాచారం.

విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని బాలయ్యతో పాటూ, యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా తనదైన సపోర్ట్ అందించారు. బాలయ్య అన్నా, ఎన్టీయార్ అన్నా తనకు చాలా చాలా ఇష్టమని విశ్వక్ సేన్ ఈ సందర్భంగా పదే పదే చెప్పుకున్నాడు.

మొత్తానికి బాలయ్యను తన సినిమాలో నటించేందుకు ఒప్పించేసుకున్నాడన్న మాట. అయితే, ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి వుంది.