శ్రావణ శుక్రవారం రోజు సాంప్రదాయబద్ధంగా తయారైన విష్ణు ప్రియ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

బుల్లితెర యాంకర్లుగా ఫేమస్ అయిన వారిలో విష్ణు ప్రియ కూడా ఒకరు. యూట్యూబ్ వీడియోస్, టిక్ టాక్ వీడియోస్ ద్వారా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియకి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే తాను నటించిన సినిమా హిట్ కాకపోవటంతో విష్ణు ప్రియకి మంచి గుర్తింపు దక్కలేదు. అయితే ఆ తర్వాత ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పోవే పోరా అనే షో కి యాంకర్ గా వ్యవహరించే అవకాశం అందుకుంది. ఈ షోలో విష్ణు ప్రియ సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసి బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ షో ద్వారా విష్ణు ప్రియ యాంకర్ గా బాగా ఫేమస్ అయ్యింది. అయితే ఈ షో తర్వాత విష్ణు ప్రియకి యాంకర్ గా చెసే అవకాశం దక్కలేదు.

అందువల్ల ఈ అమ్మడు సినిమాల మీద ధ్యాస పెట్టింది. సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పొట్టి బట్టలు వేసుకొని హాట్ ఫోటో షూట్లకి ఫోజులిస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. విష్ణు ప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. ఎద అందాలు, నడుము అందాలు చూపిస్తూ విష్ణు ప్రియ కుర్రాలను రెచ్చగొడుతూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇలా ఎప్పుడు గ్లామరస్ గా కనిపించే విష్ణు ప్రియ కొన్ని సందర్భాలలో మాత్రం సాంప్రదాయ బద్ధంగా చీర కట్టుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.

తాజాగా శ్రావణ శుక్రవారం సందర్భంగా విష్ణుప్రియ షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎప్పుడు పొట్టి బట్టలు వేసుకొని స్కిన్ షో చేస్తూ గ్లామరస్ గా కనిపించే విష్ణు ప్రియ శ్రావణ శుక్రవారం సందర్భంగా చీర కట్టుకొని ఎంతో పద్ధతిగా తయారయ్యి పూజలు నిర్వహించింది. ఎప్పుడు గ్లామరస్ గా ఉండే విష్ణు ప్రియ కి భక్తి కూడా ఎక్కువ. ఈ అమ్మడు తరచు దేవాలయాలను సందర్శిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇంట్లో పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల శ్రావణ శుక్రవారం సందర్భంగా విష్ణు ప్రియ పద్ధతిగా తయారై ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఈ ఫోటోలను చూసిన నేటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. విష్ణుప్రియలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.