షాకింగ్ : ముంబైలో తన సినిమాకి ఎదురైన చేదు అనుభవం షేర్ చేసిన విశాల్

Vishal

తమిళ సినిమా దగ్గర సెటిల్డ్ హీరో అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులకి కూడా బాగా సుపరిచితుడు అయినటువంటి ఏక్షన్ హీరో విశాల్ కోసం అందరికీ తెలిసిందే. కాగా తాను హీరోగా ప్రముఖ దర్శకుడు నటుడు ఎస్ జె సూర్య కూడా ముఖ్య పాత్రలో నటించిన ఇంట్రెస్టింగ్ సినిమానే “మార్క్ ఆంటోనీ”.

అయితే ఈ చిత్రాన్ని తెలుగు సహా తమిళ్ లో రిలీస్ చేశారు కానీ తెలుగులో ఈ సినిమా అంత ఆడలేదు బట్ తమిళ్ లో మాత్రం పెద్ద హిట్ అయ్యింది. తమిళ్ నుంచి విశాల్ కెరీర్ లోనే అత్యాధికా వసూళ్ళని ఈ చిత్రం నమోదు చేసి మళ్ళీ విశాల్ కి కం బ్యాక్ లా నిలిచింది. అయితే ఈ చిత్రానికి నిర్మాణంలో కూడా విశాల్ ఓ భాగం కాగా ఈ చిత్రాన్ని తాజాగా తాను హిందీలో కూడా రిలీజ్ చేసే ప్లాన్ చేసాడు.

కానీ ముంబై సెన్సార్ బోర్డు నుంచి తనకి ఓ షాకింగ్ అండ్ చేదు అనుభవం ఎదురైంది అని మీడియా వేదికగా వాపోయాడు. అయితే ముంబై సెన్సార్ బోర్డు ఆఫీస్ లో తాను సినిమా సెన్సార్ కి పంపితే అందుకోసం వారు ఆరున్నర లక్షలు లంచం అడిగారు అని, అవినీతి సినిమాల్లో ఉంటే ఓకే కానీ నిజ జీవితంలో అది యాక్సెప్ట్ చేయడానికి లేదు.

అది నా సినిమాకే నాకు నిజ జీవితంలో ఎదురవుతుంది అని అనుకోలేదు. ఇన్నేళ్ల కెరీర్ లో ఇలాంటి ఘటన నేను చూసింది లేదు అని తన అసహనం వ్యక్తం చేసాడు. అంతే కాకుండా దీనిని నేను కేంద్రానికి, ప్రధాని మోడీ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను అని ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నామని విశాల్ అయితే తన బాధని సోషల్ మీడియాలో తెలిపాడు. దీనితో తనకి ఎదురైన ఈ చేదు అనుభవం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.