‘విరూపాక్ష’ హీరోయిన్‌కి ‘పెనాల్టీ’ చెల్లించాల్సి వచ్చిందట.!

చిన్న విషయానికే పెద్ద పెనాల్టీ చెల్లించాల్సి వస్తే.? ‘విరూపాక్ష’ నిర్మాత ఎదుర్కొన్న వింత పరిస్థితి ఇదట.! అలాగని, చెవులు కొరుక్కుంటున్నారు సినీ పరిశ్రమలో. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్. అంతకు ముందు ఆమె ‘భీమ్లానాయక్’, ‘బింబిసార’, ‘సర్’ సినిమాల్లో నటించింది.ఓ మోస్తరు స్టార్‌డమ్ వుంది సంయుక్తకి.

ఉగాదినాడు సినిమా పోస్టర్ ఒకటి విడుదల చేస్తే, అందులో హీరోయిన్ లేదు. మాట ఇచ్చి, నిలబెట్టుకోలేదంటూ సంయుక్త గుస్సా అయ్యింది. ఆ తర్వాత ఓ పాట విడుదల చేశారు.. సంయుక్త ఫొటోతో కూడిన పోస్టర్‌తో. ఈ క్రమంలో తెరవెనుకాల చాలా కథ నడిచిందట. సినిమా ప్రమోషన్లకు ససేమిరా అనేసిందట సంయుక్త. దాంతో, ఆమెకు ‘ఫైన్’ చెల్లించి.. అంటే, అదనంగా రెమ్యునరేషన్ చెల్లించి, ఆమెను కూల్ చేశారట నిర్మాతలు. అద్గదీ అసలు సంగతి.