ఓటిటి : ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో “విరూపాక్ష” వచ్చేస్తుంది.!

ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర వచ్చిన క్లీన్ అండ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా ఈ ఏడాది ఏప్రిల్ లో వచ్చిన పాన్ ఇండియా సినిమా “విరూపాక్ష” కూడా ఒకటి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి తన యాక్సిడెంట్ తర్వాత మొదటి సినిమాగా చాలా కష్టపడి చేసిన ఈ చిత్రం ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలంగా అన్నీ సెట్ అయ్యి అయితే తన కెరీర్ లోనే భారీ హిట్ ని సొంతం చేసుకున్నాడు.

కాగా ఈ చిత్రం ఇప్పుడుకి కూడా నైజాం రీజన్ లో సూపర్ వసూళ్లు రాబడుతుండగా ఇప్పుడు అయితే ఈ భారీ హిట్ సినిమా ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ చిత్రం ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇందులో తెలుగు భాషలో మొదటగా ఈ 21మే  నుంచే స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు కన్ఫర్మ్ చేశారు. సో మరికొన్ని రోజుల్లోనే విరూపాక్ష ఓటిటి వీక్షకులను కూడా అలరించేందుకు వచ్చేస్తుంది అని చెప్పాలి. కాగా ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని అయితే దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించగా..

లేటెస్ట్ హిట్ సెన్సేషన్ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రంలో సునీల్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించగా కాంతారా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. తెలుగు మినహా ఇతర భాషల్లో అయితే అయితే ఈ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ అందించడం విశేషం.