యూఎస్ లో దుమ్ము లేపిన “విరూపాక్ష” వసూళ్లు.!

లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన మరో సెన్సేషనల్ హిట్ సినిమా “విరూపాక్ష” కోసం తెలిసిందే. మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని అంచనాలు అందుకొని బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కగా యూఎస్ లో కూడా మాసివ్ రన్ ని అయితే ఈ సినిమా సొంతం చేసుకుంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి వర్కింగ్ డేస్ లో కూడా లక్ష డాలర్స్ మేర రాబట్టి యూఎస్ లో అదరగొట్టింది.

ఇక యూఎస్ లో అయితే వారం కంప్లీట్ కాకముందే 1 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరి అక్కడి డిస్ట్రిబూస్టర్స్ కి భారీ లాభాలు అందించింది. కాగా అక్కడ థియేట్రికల్ రైట్స్ ని సుమారు నాలుగు కోట్లకి కొనుగోలు చేయగా ఇప్పుడు 8 కోట్ల గ్రాస్ ఆ నాలుగు కోట్లకి మించి షేర్ ని రాబట్టేసి ఇక మంచి లాభాలు ఇచ్చే దిశగా అయితే దూసుకెళ్తుంది.

ఇంట్రెస్టింగ్ గా యూఎస్ లో విరూపాక్ష కి మరింత డిమాండ్ నెలకొందట. దీనితో ఈ చిత్రం మరింత బెటర్ వసూళ్లు కొల్లగొడుతుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి అయితే సాయి ధరమ్ తేజ్ బిగ్గెస్ట్ కం బ్యాక్ ని అందుకున్నాడని చెప్పొచ్చు. కాగా ఈ సినిమాలో సునీల్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించగా కాంతారా, విక్రాంత్ రోనా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ వర్క్ చేసాడు.