లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ సినిమా “విరూపాక్ష”. ఓ రకంగా హీరో సాయి ధరమ్ తేజ్ కి పునర్జన్మ తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా ఇది అని చెప్పాలి. తాను రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత చేసిన ఈ సినిమా తన కెరీర్ లో మరో బిగ్ హిట్ దిశగా అయితే కొనసాగుతుంది.
కాగా ఈ సినిమా అయితే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అదిరే ఓపెనింగ్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ కూడా గట్టి ఓపెనింగ్స్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. చిత్ర యూనిట్ నే అధికారికంగా వరల్డ్ వైడ్ గా 12 కోట్ల గ్రాస్ ని రాబట్టగా 6 కోట్లకి పైగా షేర్ ని రాబట్టింది.
అంతే కాకుండా వీటిలో సుమారు 5 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ నుంచే రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే యూఎస్ నుంచి 3 లక్షల డాలర్స్ మేర ఇపుడు క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ చిత్రం మొదటి రోజు అదిరే ఓపెనింగ్స్ ని అందుకుంది అని చెప్పాలి.
కాగా ఇక ఈ రెండు రోజుల్లో కూడా ఇదే తరహా వసూళ్లు వస్తాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి అయితే సాయి ధరమ్ తేజ్ సెన్సేషనల్ కం బ్యాక్ ని కొట్టినట్టే అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో సంయుక్త మీనన్ చాలా కీలక పాత్ర చేయగా సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. అలాగే అజనీష్ సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు నిర్మాణం వహించగా సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు.