మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ( సాయిధరమ్ తేజ్ ) విరూపాక్ష, బ్రో సినిమాల తరువాత చేస్తున్నా ఎస్ డి టి 18 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న మూవీకి టైటిల్ రివీల్ చేశారు. ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కార్నేజ్ వీడియో ద్వారా రివిల్ చేశారు.ఇది శక్తివంతమైన విభిన్నమైన వాయిస్ ఓవర్ తో ఓపెన్ అయింది.
టీజర్ సాయి దుర్గ తేజ్ పవర్ఫుల్ డైలాగ్ తో ముగుస్తుంది. ఈ సినిమా కోసం సాయి దుర్గ ఫిజికల్ గా బాగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు. తేజ్ కోసం ఎంత బిజీగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు అంతేకాకుండా తేజ్ గురించి మాట్లాడుతూ తనది బండ ప్రేమ అని ఒకసారి కనెక్ట్ అయితే వదిలిపెట్టడని చెప్పుకొచ్చాడు.
తర్వాత ఈ ఈవెంట్ కి యాంకర్ గా చేసిన సుమ తేజ్ తో మాట్లాడుతూ చిన్నతనంలో చరణ్ ఎప్పుడైనా నీకు బాగా చదువుకొని సలహాలు ఇచ్చాడా అని అడిగిన ప్రశ్నకు తేజ్ సమాధానం చెప్పే లోపు రామ్ చరణ్ అందుకొని నా పేరు నిలబెట్టాలి, నాకంటే ఎక్కువ మార్కులు రావాలి అని చెప్పేవాడిని అనటంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. సుమ ఊరుకోకుండా మీ అమ్మ ఎప్పుడైనా చరణ్ అని చూసి నేర్చుకో అని చెప్పిందా అని తేజ్ ని ప్రశ్నించింది.
అలా మాత్రం చెయ్యొద్దు అని చెప్పారని తేజ్ చెప్పాడు. అయితే రామ్ చరణ్ ఊరుకోకుండా అలా చేయొద్దు..వాడిని చూసి నేర్చుకో అంటూ మాటల్లో అర్ధాన్ని మార్చేశాడు. చరణ్ టైమింగ్ కి అక్కడున్న వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి నవ్వేశారు. హనుమాన్ సెన్సేషనల్ ఫ్యాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు ఒకే నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.
Charan Swami 😂👌
Watch Till the end .. #RamCharan #SDT pic.twitter.com/vIL99OAGlz— Movies4u Official (@Movies4u_Officl) December 12, 2024