కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న యంగ్ డైరెక్టర్.!

ఓ సినిమా గొప్ప విజయం అందుకుంది అంటే అందులో మేజర్ రోల్ దర్శకునిదే అవుతుంది. ఎంత పెద్ద హీరో ఉన్నప్పటికీ దర్శకుడు సరైన కంటెంట్ ఇస్తేనే సాలిడ్ లాంగ్ రన్ పడుతుంది. మరి అలా లేటెస్ట్ గా సరైన లాంగ్ రన్ తో టాలీవుడ్ లో భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ దండు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో చేసిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం “విరూపాక్ష” కోసం తెలిసిందే. ఈ సినిమా  కంటే భారీ లాభాలు అందుకోవడంతో నిర్మాతలకి కాసుల పంట అందింది. దీనితో లేటెస్ట్ గా అయితే ఈ సినిమా నిర్మాతలు హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ ఊహించని గిఫ్ట్ అయితే ఈ యంగ్ దర్శకునికి అందించారు.

ఓ లేటెస్ట్ అండ్ కాస్ట్లీ వెర్షన్ స్టైలిష్ మెర్సిడిస్ బెంజ్ కార్ ని కార్తీక్ దండు కి గిఫ్ట్ గా అందించారు. దీనితో ఈ గిఫ్ట్ తో ఈ యంగ్ ఫిల్మ్ మేకర్ ఆనందానికి అవధులు లేవు. తనకి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినందుకు సాయి ధరమ్ తేజ్ కి తన బివిఎస్ఎన్ నిర్మాతలకి థాంక్స్ చెప్తున్నాను అని.

అలాగే ఈ సినిమాకి తనకి ఎంతగానో హెల్ఫ్ చేసిన సుకుమార్ గారికి విధేయుడినై ఉంటానని తెలిపాడు. అలా తెలిపి సాయి తేజ్, సుకుమార్ లు తన కార్ తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసి అయితే తన హ్యాపీ మూమెంట్ ని పంచుకున్నాడు. ఇక ఈ చిత్రంలో అయితే సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు.