మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “విరూపాక్ష” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో సాలిడ్ వసూళ్లు అయితే రిజిస్టర్ చేసింది.
వరల్డ్ వైడ్ గా అయితే ఈ సినిమా 12 కోట్లు గ్రాస్ అందుకోగా రెండో రోజుకి అనూహ్యంగా 16 కోట్లు గ్రాస్ ని వసూలు చేసి ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది కాగా దీనితో రెండు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 28 కోట్ల మాసివ్ గ్రాస్ ని అందుకుని రెండు రోజుల్లో 15 కోట్ల మేర షేర్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది.
అలాగే యూఎస్ లో కూడా ఏఈ సినిమాకి మొదటి రోజుకి రెండో రోజుకి కూడా క్రేజీ గ్యాప్ తో వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తుంది. అక్కడ మొదటి రోజుకి ఈ సినిమా 2 లక్షల డాలర్స్ వసూలు చేస్తే రెండో రోజుకి ఏకంగా 3 లక్షల డాలర్స్ కొల్లగొట్టి రెండు రోజుల్లోనేహాఫ్ మిలియన్ మార్క్ ని చేరుకుంది.
దీనితో రెండు రోజుల్లో ఈ సినిమా స్టన్నింగ్ వసూళ్లు అందుకొని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు నమోదు చేస్తుందని చెప్పాలి. ఇక దీనితో పాటుగా మూడో రోజు కూడా విరూపాక్ష హవా ఇదే రేంజ్ లో ఉంటుందని కూడా ట్రేడ్ అంటున్నారు.
మొత్తానికి అయితే సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఈ సినిమా సెన్సేషనల్ కం బ్యాక్ కాగా హీరోయిన్ సంయుక్త మీనన్ వరుసగా నాలుగో హిట్ ని కొట్టి టాలీవుడ్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మారింది.