డిజాస్టర్ మూవీని దాటని విరూపాక్ష..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన అద్భుతమైన సినిమాగా విరూపాక్ష గురించి ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక తేజ్ కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న మూవీ కూడా ఇదే కావడం విశేషం. ఏకంగా 22 కోట్లకి పైగా ఈ మూవీ థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్, ట్రైలర్ తోనే సినిమా ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేయడం విశేషం. తేజ్ రోడ్డు ప్రమాదం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని విరూపాక్ష సినిమా చేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో రావడం విశేషం. ఏపీ తెలంగాణలో 4.79 కోట్ల షేర్ విరూపాక్ష కలెక్ట్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 36 లక్షల షేర్ వచ్చింది. ఓవర్సీస్ మార్కెట్ లో 1.20 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ విరూపాక్ష సినిమా మొదటి రోజు కలెక్ట్ చేయగలిగింది.

గ్రాస్ పరంగా చూసుకుంటే 11.85 కోట్లు అర్జించడం విశేషం. ఈ సినిమా మొత్తం మార్కెట్ బిజినెస్ వాల్యూ 22.20 కోట్లు కాగా 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు ఈ మూవీ తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో రెండవ సినిమా కావడం విశేషం. గతంలో సాయి తేజ్ డిజాస్టర్ మూవీ విన్నర్ మొదటి రోజు 5.65 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు విరూపాక్ష సినిమా ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం.

సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ లో ఈ మూవీ కలెక్షన్స్ కి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బజ్ ఇలాగే కొనసాగితే వారం రోజులు తిరగకుండానే విరూపాక్ష బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన 23 కోట్లను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదటిరోజు 6.35 కోట్ల షేర్ రావడంతో ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్టు టాక్ సొంతం చేసుకోవాలంటే 16.65 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.