టాలీవుడ్ సినిమా ఎంతో గర్వించదగ్గ చిత్రాల్లో బాహుబలి సిరీస్ కి ఉండే స్థానం వేరు. అసలు ఇండియన్ సినిమా దగ్గర కానీ ప్రపంచ సినిమా దగ్గర కానీ ఈ రెండు సినిమాలు చేసిన వండర్ అంతా ఇంతా కాదు. దీనితో దర్శకుడు రాజమౌళితో పాటుగా హీరో ప్రభాస్ కి కూడా అమాంతం భారీ ఫేమ్ వచ్చింది.
కానీ ఈ ఫేమ్ తర్వాత ప్రభాస్ చాలా ఇంట్రెస్టింగ్ స్టెప్స్ తీసుకున్నాడు. ఊహించని విధంగా జస్ట్ ఒక్క చిత్రం ఎక్స్ పీరియన్స్ ఉన్న కొత్త దర్శకులతో సినిమాలు అనౌన్స్ చేస్తూ ఆశ్చర్యపరిచిన ప్రభాస్ ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నాడు. కంప్లీట్ యంగ్ టాలెంట్ నే నమ్ముతున్నా ఈ పాన్ ఇండియా హీరో కొత్తగా మరో కొత్త దర్శకునికి అవకాశం ఇచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
కాగా ఈ ఏడాది టాలీవుడ్ లోకి నాచురల్ స్టార్ నాని హీరోగా చేసిన క్రేజీ మాస్ చిత్రం “దసరా” దర్శకుడు ఓదెల శ్రీకాంత్ అయితే ప్రభాస్ కి ఒక మాస్ లైన్ చెప్పగా ప్రభాస్ దానికి ఇంప్రెస్ అయ్యాడట. ప్రభాస్ ని ఒక రస్టిక్ పాత్రలో తాను పరిచయం చేయగా ఈ కాంబినేషన్ ఓకే అయ్యింది అంటూ కొన్ని రూమర్స్ ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో స్టార్ట్ అయ్యాయి.
దీనితో నాని దర్శకునికి ప్రభాస్ అవకాశం ఇవ్వడం ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది అని అంటున్నారు. మరి దీనిపై మాత్రం ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇక ఇప్పుడు అయితే ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ బిగ్ స్క్రీన్స్ ని హిట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కేవలం ఇంతకు ముందు మూడు చిత్రాలు మాత్రమే చేసాడు.