వైరల్ ఫోటో: జూనియర్ ఎన్టీఆర్‌ పక్కన ఇంత చక్కగా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Jr NTR With His Sister Nandamuri Suhasini

‘యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పక్కన ఇంత చక్కగా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా’ అంటూ ఆయన అభిమానులు ఓ ఫోటోను తెగ షేర్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలను ఫాలో అయిన వాళ్లకు ఎన్టీఆర్‌ పక్కన ఉన్న ఆమె ఎవరో ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఇంకా గుర్తుపట్టలేదా? అమె ఎవరో కాదండి.. ఎన్టీఆర్‌ సహోదరి నందమూరి సుహాసిని, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసింది.

Jr NTR With His Sister Nandamuri Suhasini

ఇక ఎన్టీఆర్‌-సుహాసినిల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ్ముడు అంటే అక్క సుహాసినికి ఎంతో ఇష్టంగా కాగా.. అక్క సుహాసిని అంటే తారక్‌కు ఎనలేని గౌరవం. ఇక ఎన్టీఆర్‌ తన ప్రతీ చిత్రాన్ని అక్కకు ప్రత్యేకంగా చూపించి రివ్యూ అడగతాడంటా. అంతేకాకుండా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా అక్కతో తప్పకుండా రాఖీ కట్టించుకుంటాడు. ఇక ఈ విషయాలను పక్కకు పెడితే ప్రస్తుతం ఈ అక్కా తమ్ముడి పాత ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో తెగ లైక్‌లు షేర్లను ఈ ఫోటో సాధిస్తోంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టిస్టారర్‌ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు 70శాతం పూర్తయ్యింది. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. అక్టోబర్ 2వ వారం నుండీ తిరిగి షూటింగ్ మొదలుపెట్టడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో పాటు ప్రశాంత్‌ నీల్‌తో ఎన్టీఆర్‌ వరుసగా చిత్రాలు చేయనున్నారు.

Jr NTR With His Sister Nandamuri Suhasini