వైరల్ : బాలయ్య పనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. 

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి అతి పెద్ద మార్కెట్ ఉన్న ఫ్యామిలీస్ లో నందమూరి కుటుంబం కూడా ఒకటి. కాగా ఈ ఫ్యామిలీలో ఉన్న కోల్డ్ వార్స్ కోసం తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఫైనల్ గా మళ్ళీ వాళ్లంతా ఒకటే అన్నట్టుగా కొన్ని సందర్భాలు కనిపిస్తాయి.

కానీ మెయిన్ గా బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎప్పుడు నుంచో కొన్ని రసవత్తర పరిస్థితులు ఉన్నాయి. కాగా బాలయ్య ఎన్టీఆర్ విషయంలో కాస్త దురుసుగా లేదా పట్టించుకోనట్టు ప్రవర్తించడం ఇలా చాలానే కనిపించేవి దీనితో ఎన్టీఆర్ పై సింపతీ కనిపించేది.

అయితే ఇవి ఎప్పటికీ తీరవు కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ మరియు బాలయ్య ఫ్యాన్స్ మధ్య అగ్గి రాజుకుంది. ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకి నందమూరి అభిమానులు సహా కుటుంబం కూడా చేరుకున్నారు. ఈరోజు ఉదయాన్నే ఎన్టీఆర్ సహా కళ్యాణ్ రామ్ లు కూడా తమ నివాళులు అర్పించగా కొన్ని గంటల తర్వాత బాలయ్య నివాళులు అర్పించడానికి వచ్చారు.

కానీ అక్కడ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హరికృష్ణ లపై ఫ్లెక్సీ లు కనిపించడం కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడంతో బాలయ్యకి చిర్రెత్తుకొచ్చినట్టు ఉంది. దీనితో ఆ ఫ్లెక్స్ లు అన్నీ తీసి పారేయమని ఆజ్ఞాపించాడు. దీనితో ఈ కటౌట్స్ తీసేయడం విషయంలోనే ఎన్టీఆర్ మరియు బాలయ్య అభిమానులు మధ్య పెద్ద రచ్చే నడుస్తుంది. ఇక ఇది ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి మరి.