వైరల్ : ఈ యంగ్ స్టార్ ని టార్గెట్ చేసిన అనసూయ.?

తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర మంచి క్రేజ్ ఉన్నటువంటి గ్లామరస్ యాంకర్స్ లో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. మరి అనసూయ ఇప్పుడు సినిమాల్లో కూడా యమా బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడూ వస్తూ ఏదొక కాంట్రవర్సీతో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.

మరి  అనసూయ కావాలని కొన్ని కామెంట్స్ చేస్తుందో లేక వేరే కారణం ఏమో కానీ మంచి అటెన్షన్ ని మాత్రం అనసూయ పట్టేసి వెళ్ళిపోతుంది. ఆ మధ్య అలాగే “ఆంటీ” అంటారా అంటూ కొంతమందిని అరెస్ట్ చేసే వరకు కూడా వెళ్ళింది. ఇక నిన్న వీకెండ్ ఖాళీ దొరికినట్టు ఉంది.

దీనితో సోషల్ మీడియాలో రావడంతోనే కాంట్రవర్సీ కి తెర ఆ లేపింది. ఇప్పుడే ఒకటి చూసాను “ది” అని ఒకరు పెట్టుకున్నారు ఇదేం పైత్యం ఇది మాకు రాకుండా ఉంటే చాలు అంటూ ట్వీట్ చేసింది. అయితే అసలు ఇది ఎవరు అని ఆరా తీస్తే అది యంగ్ అండ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ విషయంలో అన్నట్టు అర్ధం అయ్యింది.

రీసెంట్ విజయ్ దేవరకొండ సినిమాల పోస్టర్స్ చూస్తే ఈ పోస్టర్ లో “ది విజయ్ దేవరకొండ” అని తన పేరు ఉంటుంది. దీనికి కూడా టార్గెట్ చేస్తూ ఆమె పోస్ట్ చేయడం పైగా దానిని విజయ్ పై పైత్యం అంటూ పేరు పెట్టడం అనేది షాకింగ్ గా మారింది. దీనితో ఒక నెటిజన్స్ మరోసారి అనసూయ పై మండిపడుతున్నారు. అంతేకాకుండా కొందరు అభిమానులు స్ట్రాంగ్ రిప్లై లు కూడా ఇస్తున్నారు.