రాజావారు రాణిగారు, ఎస్. ఆర్. కల్యాణ మండపం, సమ్మతమే తదితర చిత్రాలతో యువతను ఆకర్షించిన టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. నవతరం కథనాలతో ఆడియన్స్ ను ఆకర్షిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు అతడు GA2 బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలో నటించాడు. మురళీ కిశోర్ దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 18న శివరాత్రి స్పెషల్ కానుకగా.. విడుదల అయ్యింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు ఒకరోజు ముందు తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన సార్ కూడా విడుదల అయింది. అది కూడా పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అలా ఈ రెండు చిత్రాల మధ్య పోటీ నెలకొంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా మొదటి రోజు బుకింగ్స్ కన్నా రెండో రోజు పెరిగాయని తెలుస్తోంది. ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చడంతో బుకింగ్స్ పెరిగినట్లు అర్థమవుతోంది.
ఇకపోతేతెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొలి రోజు రెండు కోట్ల నలభై లక్షల గ్రాస్ వచ్చినట్లు తెలిసింది. ఎస్.ఆర్ కళ్యాణమండపం తర్వాత కిరణ్ అబ్బవరం కెరీర్‌లో హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా వినరో భాగ్యము విష్ణుకథ నిలిచింది. నైజాం ఏరియాలో 60 లక్షల, సీడెడ్‌లో 20లక్షలకుపైగా వినరో భాగ్యము విష్ణుకథ సినిమాకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఓవర్‌సీస్‌లో ఈ సినిమా పది లక్షల వరకు వసూళ్లను రాబట్టినట్లు చెబుతున్నారు. మరి రెండో రోజు కలెక్షన్స్ వివరాలు ఇంకా తెలియలేదు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు నాలుగు కోట్ల వరకు జరిగినట్లు తెలిసింది.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఫోన్ నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ స్టోరీని డిజైన్ చేశారు దర్శకుడు. మన ఫోన్ నెంబర్ లో లాస్ట్ డిజిట్ కి అటు పక్క ఒక నెంబర్, ఇటు పక్క ఒక నెంబర్ ఉంటుంది కదా. అలా హీరోయిన్ తన నెంబర్ కి ఉన్న నైబర్ నంబర్స్ ని కాంటాక్ట్ అవుతుంది. అందులో ఒక నెంబర్ హీరో కిరణ్ అబ్బవరంది, మరో నెంబర్ మురళీశర్మది. ఈ ముగ్గురు మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు ఆడియన్స్ ని అలరించేలా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక హీరోయిన్ లాగానే, హీరో కూడా ఇలానే చేస్తాడు. వాటిలో ఒక నెంబర్ హీరోయిన్‌ది అయితే, మరో నెంబర్ విలన్‌ది. ఇలా నైబర్ నంబర్స్ ని కాంటాక్ట్ అవ్వడం వల్ల హీరో, హీరోయిన్ అనుకోని ప్రమాదంలో పడతారు. దాని నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేదే మిగిలిన కథ.