RRR: విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ లో నటనకు మార్కులు వేసింది ఎవరికీ…!

RRR: రాజమౌళి మాస్టర్ మైండ్ తో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటన విశ్వరూపంతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చిత్రం ఆర్ఆర్ఆర్. విడుదలైన దగ్గర నుంచి ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మానియానే కనిపిస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్క సెలబ్రిటీ రాజమౌళి దర్శకత్వ ప్రతిభను, ఎన్టీఆర్ రామ్ చరణ్ నటన మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ రామ్ చరణ్ నటన స్క్రీన్ స్పేస్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి.

సినిమాలో స్క్రీన్ స్పేస్ విషయానికి వస్తే చరణ్ కు ఎన్టీఆర్ కంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఈ విషయంలో పైచేయి సాధించారని అభిమానులు అంటున్నారు. అయితే నటన పరంగా కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ డామినేట్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా కథా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భీమ్ పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో ఒక సీన్ లో నటించిన తీరు ప్రేక్షకుల హృదయాలను కదిలించే విధంగా ఉందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీని చూసిన వాళ్లు ఒక సీన్ లో తారక్ నటనను చూసి భావోద్వేగానికి గురవుతున్నారని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించారని ఆయన కామెంట్లు చేశారు.

కొమరం భీమ్ లో సాంగ్ లో ఎన్టీఆర్ నటనతో అందరినీ ఆ కట్టుకున్నారని, ఆ పాటలోని నటనతో నటుడిగా మరొక మెట్టు పైకి ఎదిగారని విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు. నటనలో చరణ్ తో పోలిస్తే ఎన్టీఆర్ సీనియర్ అని, తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు అని పేర్కొన్నారు.తనకు మాత్రమే సొంతమైన అద్భుతమైన ఎక్స్ ప్రెషన్లతో తారక్ సాధారణ సన్నివేశాలతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.