మాస్టర్ ఎఫెక్ట్.. రేటు పెంచిన సేతుపతి

vijay sethupathi as ltte prabhakaran in a new web series

మాస్టర్ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా నెగిటివ్ రోల్ లో నటించిన విజయ్ సేతుపతి మళ్ళీ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది. 96 హిట్టుతో హీరోగా ఏ రేంజ్ లో క్లిక్కయ్యాడో అందరికి తెలిసిందే. అయినా కూడా కేవలం హీరోగానే చేయకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో విలన్ గా చేయడానికి ఒప్పుకుంటున్నాడు. 

విజ‌య్ సేతుప‌తి కండీష‌న్స్‌ న‌చ్చ‌లేదా?
అయితే ఇటీవల మాస్టర్ సినిమా కలెక్షన్స్ పరంగా హిట్టని తేలింది. టాక్ ఎలా ఉన్నాకూడా విజయ్ సేతుపతి చేసిన భావాని పాత్ర బాగానే క్లిక్కయ్యింది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఆ సినిమాకు విజయ్ సేతుపతి 8 నుంచి 9కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వస్తోంది. అయితే పాత్ర క్లిక్కవ్వడంతో ఇప్పుడు ఆ సంఖ్య 12ను దాటినట్లు కోలీవుడ్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. 

విజయ్ సేతుపతి నెక్స్ట్ ఉప్పెన సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో కూడా విలన్ పాత్రలోనే కనిపించనున్నాడు. ఆ పాత్ర సైతం క్లిక్కయ్యిందంటే ఈ యాక్టర్ రేంజ్ మరో స్థాయికి వెళ్లినట్లే. మరి ఉప్పెన సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి. అలాగే ఈ నటుడికి బాలీవుడ్ నుంచి కూడా పలు ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా సేతుపతి మాత్రం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు.